మాజీ సీఎం జగన్ ను కలిసిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ తో ఐదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం పంచలోహాల శ్రీవారి విగ్రహం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
వైఎస్ఆర్సిపితో కలిసి ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి పంచలోహాల విగ్రహం అందజేసి ఆయనతో కాసేపు ముచ్చటించారు. *ఐదేళ్ల క్రితం సెప్టెంబర్ 19వ తేదీ అశేష జన వాహిని గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన నచ్చి ఆయనతో కలిసి చేసిన తన రాజకీయ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు*. వైఎస్ఆర్సిపి హయాంలో పేద విద్యార్థుల కోసం స్థాపించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా ఈనెల 19వ తేదీన పాడేరులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన మేరకు తమ అధినేత జగన్ ని కలవలేకపోయానన్నారు. దేశంలోనే దమ్మున్న నేతగా జగన్మోహన్ రెడ్డి కోట్లాది ప్రజల గుండె చప్పుడయ్యారన్నారు. ఆయన చూపుతున్న బాటలో మళ్లీ ప్రజలకు సేవ చేసే వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తీసుకువస్తామని ఈ సందర్భంగా వాసుపల్లి తెలిపారు. చిరు వ్యాపారులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం....
ఆపరేషన్ లంగ్స్ పేరుతో పేద ప్రజల లంగ్స్ ను కొల్లగొట్టారని అన్నారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా దోచుకుంటున్న బడా బాబులను వదిలేసి, పొట్ట కూటికోసం చిన్న బడ్డీ పెట్టుకుంటున్న చిరు వ్యాపారులను దారుణంగా తొలగించడమే కాకుండా వారి దుకాణాలు కూడా ధ్వంసం చేయడం సరికాదన్నారు. చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేంతవరకు వారి పక్షాన పోరాడుతామన్నారు. స్ట్రీట్ వెండర్లు కు ప్రత్యేక హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేసి నష్టపరిహారం అందజేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
What's Your Reaction?