డాక్టర్ మణి భూషణ్ చిల్డ్రన్ టూరిజం క్లబ్స్ (సీటీసీ) లోగో ఆవిష్కరణ
వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్స్వం నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో అంతర్జాతీయ మహిళా దినోత్స్వం మరియు వి టి టి ఎఫ్ సక్సెస్ మీట్ స్థానిక దసపల్లా హోటల్ లో ప్రముఖ దర్శకుడు , జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత , ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ మణి భూషణ్ గారి అద్వర్యం లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధి వాస్తు బ్రహ్మ డాక్టర్ శ్రీ నారాయణ మూర్తి పట్నాయక్ మరియు సామజిక, సాహితి వేత్త శ్రీమతి జాలాది విజయ గారు మరియు శ్రీ ఏ ఎం ప్రసాద్ గారు హాజరయ్యారు వారి చేతుల మీదుగా డాక్టర్ మణి భూషణ్ యొక్క చిల్డ్రన్ టూరిజం క్లబ్స్ (సీటీసీ) లోగో ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్బంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్స్వం లో ఉత్తమ సేవలు అందిస్తూ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ తో భాగస్వామ్యం అయిన ప్రతిభ కలిగిన నారిమణులకు అవార్డు లు అందజేశారు . ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ మహిళలకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి, వారి నైపుణ్య శిక్షణ ఇచ్చి, పారిశ్రామిక వేత్తలుగా లేదా స్వయం సేవ సంఘాలుగా ఏర్పడి జీవన ప్రమాణ స్థాయిని పె
రాబోయే రోజుల్లో పర్యాటకం మరియు కృత్రిమ మేధస్సు ఉపయోగం పై చాల వినూత్న కార్యక్రమాలు రూపుద్దికోబోతున్నాయని తెలిపారు. సీటీసీ గూర్చి మరిన్ని వివరాలు త్వరలో తెలియపరుస్తామని కేవలం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్స్వం సందర్బంగా లోగో లాంచ్ చేశామని తెలిపారు . ఎవ్వరైనా భాగస్వామ్యం అవ్వాలని ఉంటె 9848418582 కాల్ చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో నిర్మాత ఆదిత్య భూషణ్ , అడ్మిన్ సత్యవాణి , లీగల్ అడ్వైసర్ ప్రవీణ , ప్రముఖులు ,శ్రేయోభిలాషులు అధికసంఖ్యలో హాజరయ్యి జయప్రదం చేసారు మరియి డాక్టర్ మణి భూషణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు
What's Your Reaction?