వి హెల్త్ కేర్ సేవలు అభినందనీయం డాక్టర్ పి కె జోస్

విశాఖపట్నం : వి హెల్త్ కేర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కన్సర్న్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పి కె జోస్ పేర్కొన్నారు. బుధవారం వి హెల్త్ కేర్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్య ఆరోగ్య అంశాలపై సాధారణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడానికి వీ హెల్త్ కేర్ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మరొక అతిథిగా పాల్గొన్న విశాఖ పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్ రిటైర్డ్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ వి. ఉషారాణి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న వీ హెల్త్ కేర్ యాజమాన్యాన్ని ఆమె కొనియాడారు.

వి హెల్త్ కేర్ సేవలు అభినందనీయం  డాక్టర్ పి కె జోస్

విలువలతో కూడిన వైద్య సేవలు అందించడమే వి హెల్త్ కేర్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. హెల్త్ కేర్ డైరెక్టర్ కె.ఎం.కె రమేష్ మాట్లాడుతూ గత ఏడాదిగా ఉచిత వైద్య శిబిరాల ద్వారా వేలాది మందికి ఉచిత వైద్య పరీక్ష నిర్వహించామన్నారు. తమకు సహకరించిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ కేర్ హెడ్ సిహెచ్. కృష్ణ మాట్లాడుతూ మాస్టర్ హెల్త్ చెకప్ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన

ప్యాకేజీలకు విశేష ఆదరణ లభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పార్వతి, కె. రమ్య, కె. పృథ్విరాజ్, లతీష, రమణమ్మ, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow