మాక్ పార్లమెంట్ పోటీల్లో చెన్నా ప్రణాళికకు ది బెస్ట్ స్పీకర్ అవార్డు
విశాఖ సిటీ: ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సందర్భంలో ఇండియాలో విధించిన ఎమర్జెన్సీ ను ఉద్దేశించి 50th ఇయర్ డార్క్ చాప్టర్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ బై కాంగ్రెస్ అనే అంశంపై మాక్ పార్లమెంట్ పోటీల్లో ఎన్. బి. ఎం. న్యాయ కళాశాల విద్యార్థిని చెన్నా ప్రణాళిక ది బెస్ట్ స్పీకర్ అవార్డు గెలుచుకున్నారు. బిజెవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఓరుగంటి మాధవరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథిగా బి జే వై ఎం, నేషనల్ ప్రెసిడెంట్, ఎంపి ఎల్. ఎస్. తేజస్వి సూర్య పాల్గొన్నారు.
పలు కళాశాలల నుంచి విద్యార్దులు, ప్రజలు హాజరై ఎమర్జెన్సీ పై వారి వారి ప్రసంగాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో చెన్నా ప్రణాళిక ప్రసంగిస్తూ... అప్పట్లో ఎమర్జెన్సీ లో మీడియా స్వేచ్ఛ, ప్రజల స్వేచ్ఛ, అన్ని రంగాలు ఎలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి అనే అంశాలను సంపూర్ణంగా అనర్గళంగా ప్రసంగించి ది బెస్ట్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, బిజేవైఎం నేతలు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?