భవిత బాటకు భావం చెప్పేవి కలలే ప్రభుత్వ పరము గా ప్రోత్సాహము జిల్లా కళాకారులకు సత్కారం
డాబా గార్డెన్స్, ఏప్రిల్. 10 భవితబాటకు కళలు భాష్యం చెబుతాయని వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.గురువారం ఉదయం వీ జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభావంతుల ప్రోత్సాహ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో చోటు చేసుకుంటున్న అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించటంతో పాటు జన జాగృతికి కళలు ఎంతో తోడ్పడుతున్నాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రతిభావంతులైన ఎంతోమంది కళాకారులు ఉన్నారని ఎన్నో సందర్భాల్లో వుడా వి.ఎం.ఆర్.డి.ఏ వీరిని ప్రోత్సహించిందన్నారు ప్రభుత్వ పరముగా కళా కారులు కి తగిన సహకారం అందిస్తా మన్నారు... కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీ ను బాబు మాట్లాడుతూ విశాఖలో ఉన్న ప్రతిభావంతులను జిల్లా యంత్రాంగం మరింతగా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గతంలో వలే స్థానిక ఉత్సవాల్లో ప్రాంతీయ కళా ప్రతిభకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. కళా కారులు కి, జర్నలిస్ట్ లకు
అంతర్జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ మాట్లాడుతూ గతంలో వుడా ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలకు ఒక కమిటీ ఉండేదని ఈ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభకు అవకాశాలు ఇచ్చేవారన్నారు. రాష్ట్రస్థాయి కళారత్న పురస్కారాలు వలె ప్రాంతీయ ప్రతిభను ప్రోత్సహిస్తూ జిల్లా యంత్రాంగం ప్రతిభా పురస్కారాలను అందించి ప్రోత్సహిస్తే మంచిదన్నారు. విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు క్యాలు జనార్ధన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు యాద కుమార్, నంది అవార్డు గ్రహీత శివ జ్యోతి, ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి. కే. రామేశ్వరి, ఈ టీవీ పాడుతా తీయగా సంగీత కళాకారులు కీరవాణి ప్రసాద్, ధనుంజయ, తాళ్లపాక సందీప్, పక్కి అరుణ్ సాయి, కరెమ్ మమత తదితరులు పాల్గున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి గిరిజన జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓలేసి ప్రసాద్, 35వ వార్డ్ శానిటర్ ఇన్స్పెక్టర్ సింగూరు సత్యనారాయణ లను ప్రణవ్ గోపాల్, గంట్ల శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు.
What's Your Reaction?