పాకిస్తాన్ ను యుద్ధంలో మట్టికరిపించడానికి సిద్దం - చెన్నా ప్రణాళిక ఎన్ సి సి 'బి' సర్టిఫికెట్ హోల్డర్

విశాఖ సిటీ: కాశ్మీర్ లోని, పహాల్గాం ప్రాంతంలో భారతీయ పర్యాటకులను అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు, ఉగ్రవాద సంస్థలను భారత్ పైకి రెచ్చగొడుతున్న పాకిస్తాన్ ను యుద్ధంలో మట్టికరిపించడానికి మేము సైతం సిద్దం అంటూ... ఎన్ సి సి 'బి' సర్టిఫికెట్ హోల్డర్, న్యాయ విభాగం 3/5 విద్యార్థిని చెన్నా ప్రణాళిక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నాలుగు సంవత్సరాల క్రితం ఎన్ సి సిలో చేరినప్పటినుంచి దేశానికి సేవ చేసి, రుణం తీర్చుకునే సదవకాశం ఎప్పుడొస్తుందా... అని ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు. యుద్ద రంగంలో తమ సత్తా చాటుకునేందుకు, దేశానికి సేవ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశమివ్వాలని ఈ సందర్భంగా ఎన్ సి సి క్యాడేట్ చెన్నా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వంను అభ్యర్థించారు. తానే కాకుండా తన ఎన్ సి సి సహచరులు కూడా పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.భారత దేశ కేంద్ర ప్రభుత్వం ఎన్ సి సి క్యాడేట్స్ సేవలను కూడా వినియోగించుకోవాలని, దేశ రక్షణకు ఎల్లప్పుడూ తాము కట్టుబడి ఉన్నామన్నారు చెన్నా ప్రణాళిక. యుద్ద రంగంలో శత్రువులను ఎలా మట్టుబెట్టాలో అనే అంశంలో తమకు పూర్తిగా, సంపూర్ణంగా ట్రైన

పాకిస్తాన్ ను యుద్ధంలో మట్టికరిపించడానికి సిద్దం  - చెన్నా ప్రణాళిక  ఎన్ సి సి 'బి'  సర్టిఫికెట్ హోల్డర్

ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతు తెలపాలని, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపడానికి భారత దేశ పౌరులుగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుల వారసులుగా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎల్లవేళలా పరితపిస్తున్నట్లు చెన్నా ప్రణాళిక పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow