తెలుగు దేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయకపోతే మరో విద్యుత్ పోరాటం సిపిఎం
పెంచిన విద్యుత్ చార్జీలను, ట్రూ అప్ చార్జీలను, స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కంచరపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బర్మా క్యాంప్ లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బి. పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విపరీతమైన భారాలు మోపడం జరిగింది. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదల, పన్నులు భారాలతో సతమతమవుతున్న ప్రజలకు గోరు చుట్టుపై రోకలి రోకలి పోటుల ఈ కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపింది. స్మార్ట్ మీటర్లు పెట్టి అదాని కి కోట్ల రూపాయలు లాభం చేకూర్చే విధంగా రాష్ట్రo లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుంది. ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు,
కరెంట్ డ్యూటీస్ ఉపసంహరించకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ మరో విద్యుత్ పోరాటం ప్రజలందరినీ కదిలించి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తు న ఉద్యమం చేస్తుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.ఈ కార్యక్రమం లో జోన్ నాయకులు ch. కమల, డి. పాపమ్మ, జి. దేవి, సీత, రత్నం, ch.హైమ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?