కమిషను ఏర్పాటుకు చట్ట బద్దత లేదు వర్గీకరణ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

వర్గీకరణ ను అనుమతిస్తూ ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341 కి విరుద్ధం , అ తీర్పు అమలుకు రాష్ర్ట ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమీషన్ కు కూడా చట్ట బద్దతలేదని జాతీయ ఎస్సి కమీషన్ అనుమతి లేని కమిషన్ల సిఫార్సులు చెల్ల నేరవని విదసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశార ఎస్సి వర్గీకరణ అమలు కోసం రాష్ర్ట ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ ఏక సభ్య కమీషన్ ఈ రోజు విశాఖ కలెక్టరు కార్యాలయంలో దళిత సంఘాల నుండి వినతి పత్రాలు స్వీకరించింది ఈ సందర్భగా విదసం భాగ స్వామ్య సంఘాలు భీమ్ సేన వార్, ఏ ఐ డీ ఆర్ ఎఫ్, దళిత సేన, తదితర సంఘాలు వర్గీకరణ తీర్పులోని అంశాలపై రాజ్యాంగ పరమైన అభ్యంతరాలను కమీషన్ కు వ్రాత పూర్వకంగా సమర్పించారు అనంతరం విదసం , వివిధ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు ఎస్సి జాబితాలో సముదాయములు , భాగములు మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని ఆర్టికల్ 341, 342 స్పష్టం చేస్తున్నాయని , ఈ ఆర్తికల్ సవరణ చేయాలంటే పార్లమెంటులో మూడొంతులు మెజారిటీ ఉండాలని , రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు సామాజిక విద్యా వెనుకబాటు ద్వారా మాత్రమే వచ్చాయని ఆర్థిక

కమిషను ఏర్పాటుకు చట్ట బద్దత లేదు వర్గీకరణ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధం

ఎస్సిలకు సంబంధించి పాలసీలలో ప్రథాన మార్పులు చేయాలంటే ఆర్టికల్ 338 క్లోజ్ 9 ప్రకారం ఎస్సి కమీషన్ అనుమతి తీసుకోవాలినీ *దళిత సేన గొల మాల అప్పారావు* అన్నారు.. గతంలో 97నుండి 2004 వరకూ మన రాష్ర్టంలోనూ, 30 ఏళ్ల పాటు పంజాబ్ లోనూ అమలు చేసిన ఎస్సి వర్గీకరణ విఫలం అయిందని *ఏ ఐ డి ఆర్ ఎఫ్ నేత వేణు గోపాల్ గుర్తు చేశారు.

జాజి ఓంకార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోడా దాసి సుధాకర్, బంటు కృష్ణా రావు, రవి సంతోష్, గుడాల ఈశ్వర రావు, మాటూరు శ్రీనివాస రావు వసంత రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow