ఏయూ వీసీని మర్యాదపూర్వకంగా కలిసిన గంట్ల అప్పన్న క్షేత్ర మహోత్యము పుస్తకం బహాకరణ
ఆంధ్ర యూనివర్సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య,ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ ను సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సోమవారం తన చాంబర్ లో మర్యాదపూర్వక కలిసారు. ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం కు చెందిన పవిత్రంతోపాటు, క్షేత్ర మహత్యం పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. విశ్వవిద్యాలయం వి సి రాజశేఖర్ హయాంలో మరింతగా పురోగాభివృద్ధి సాధిస్తుందని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్ష వ్యక్తము చేసారు..ఆచార్య రాజశేఖర్ గణిత మేధావి గా,
యంగ్ సైంటిస్ట్ గా ప్రపంచ వ్యాప్తముగా గుర్తింపు పొందారన్నారు..అటువంటి మేధావి సింహాచలం నుంచి ప్రపంచ .వ్యాప్తంగా గుర్తింపు పొందడం తమకు ఏంతో గర్వం గా ఉందన్నారు...
What's Your Reaction?