అన్నదానానికి వాసుపల్లి రూ.5000 విరాళం
* జీవీఎంసీ 36వ వార్డు రంగిరీజు వీధిలో *ఆర్ఆర్ బాయ్స్ ఆధ్వర్యంలో జరగనున్న అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 5000 రూపాయలు విరాళం అందజేశారు* . ఆశీలమెట్ట కార్యాలయంలో నిర్వాహకులకు సొంత నిధులతో తన వంతు సాయం అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాలు అంబరాన్నంటాయన్నారు. వినాయక ఉత్సవాల నవరాత్రులు జరుగుతున్న అన్నదాన కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు.
దక్షిణ నియోజకవర్గ ప్రజలకు శ్రీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సంస్కృత విభాగం సెక్రెటరీ సాగర్, సౌత్ వేవ్స్ వింగ్ ప్రెసిడెంట్ కాకి పద్మ,36వ వార్డ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షకిల్, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ,మరియు వైస్సార్సీపీ నాయకులు,ఆర్ ఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
What's Your Reaction?