శ్రీ రాజరాజేశ్వరి నాట్య కళ సేవా సంఘం
30-03-2025, ,గాజువాక వద్ద నక్క వాని పాలెం నందు ప్రముఖ సినీ నటులు ప్రొడ్యూసర్, డైరెక్టర్, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ విశాఖపట్నం ,ఏయూ బోర్డు మెంబర్ దియేటర్ ఆర్ట్స్ ,శ్రీ అయినవోలు ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ సంఘ సేవకురాలు, ఎక్స్ సెన్సార్ బోర్డు మెంబర్, శ్రీమతి పాలూరి శేషు మాంబ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి,వారి ఇరువురి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ తో కోలాట నృత్య శిక్షణ తరగతులను ఆరంభించితిరి.
ఈ కార్యక్రమానికి శ్రీ రాజరాజేశ్వరి నృత్య కల
కోలాట సంక్షేమ సంఘం సభ్యులు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీమతి లోవ రాజేశ్వరి దేవి గారు మరియు సభ్యులు అయినటువంటి ఏపీ హై కోర్ట్ అడ్వకేట్ పి.పరమేశ్వర్ గారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ రవి గారు, ఐ.ఎఫ్.ఎం.ఏ,ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ అనిల్ బాబు నెట్టి సభ్యులు పాల్గొన్నారు. ఎన్ .ఎస్ .ఎస్, నోడల్ అధికారి ఈ.పీ.ఎస్, భాగ్యలక్ష్మి, జిల్లా యాదవ మహిళ ప్రతినిధి తోనంగి వెంకటరమణ యాదవ్ తదితరులు రాజేశ్వరి గారిని సత్కరించారు.
ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ దేవుని సన్నిధానంలో మహిళల కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. కోలాటం వల్ల మానసిక ఆనందం ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. శేషు మాంబ గారు మాట్లాడుతూ కోలాట శిక్షణ ఇస్తున్న గురువు లోవ రాజేశ్వరిని నేర్చుకుంటున్న మహిళలను అభినందించారు.
What's Your Reaction?