విశాఖ దక్షిణ నియోజకవర్గం 36 వార్డు పరిధి లో ఉన్న పూర్ణమార్కేట్ దగ్గర ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా , 36వార్డ్ తెలుగుదేశం పార్టీ సభ్యులు మరియు వార్డ్ ఇంచార్జి కేదారి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్యఅతిథిలుగా విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు,విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి గారు, గౌ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్యసేవ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారి చేతుల మీదగా ,స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి,విగ్రహాన్ని ఆవిష్కరించారు, మరియు పులిహోర పంపిణీ మరియు,స్థానిక 36వార్డ్ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్య అతిదీ మాట్లాడుతూ

విశాఖ దక్షిణ నియోజకవర్గం  36 వార్డు పరిధి లో ఉన్న పూర్ణమార్కేట్ దగ్గర ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తెలుగువారి అభ్యున్నతి కోసం, ఆత్మగౌరవం నిలపడం కోసం అన్నగారు నందమూరి తారక రామారావు గారు 1982, మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకుంటూ 43 ఏళ్లుగా నిస్వార్ధంగా తెలుగుదేశం జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం శుభాకాంక్షలు తెలుపుతూ

ప్రగతి, ప్రజాసంక్షేమం కోసం జన్మించిన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమం తెలుగుదేశం పార్టీ. పేదవారి ఆకలి తీరాలని, సామాజిక న్యాయం సిద్ధించాలని స్వర్గీయ అన్నగారు నందమూరి తారకరామారావు గారు రెండురూపాయలకే కిలో బియ్యం అందించి సంక్షేమ పాలనకు నాంది పలికారు. "సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు" అని నినదించి, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అక్కున చేర్చుకున్న జననేత.

ఈరోజు, స్వర్ణాంధ్ర సాధన కోసం ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో 36వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ గణపతి గారు, వార్డ్ ఇంచార్జి కేదారి లక్ష్మీ గారు,వార్డ్ మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు గారు,ఒదురు చిన్న, రాము,రాంబాబు,ఆదిలక్ష్మి, బృంద,ఒదురు శివయ్య,కోరుకొండ సూర్యప్రసాద్, అత్తిలి కృష్ణ, కుమార్,గౌతమ్,వెంకటలక్ష్మి,బోడేటి కిరణ్,బొర్రా ఈశ్వరావు, రెడ్డి రమణ,కుర్రు రమణ,భద్రరావు, రాయి రాము,ఒదురుకుమార్, త్రినాధ్, ఒదురు శ్రీను ,స్థానిక వార్డ్ నాయకులు, కార్యకర్తలు పాల్గున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow