మధురవాడలోని ప్రైవేట్ పాఠశాలలో అమానుషం : 8వ తరగతి విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయుడు

విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడి అమానుష చర్య కలకలం రేపింది. శ్రీ తనుష్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ మాస్టర్ మోహన్, 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ని ఇనుప బల్లకేసి చితకబాదడమే కాకుండా పిడుగులు గుద్దడంతో విద్యార్థి చేయి మూడు చోట్ల విరిగిపోయింది. తీవ్ర గాయాల పాలైన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని తెలిపారు. ఘటన అనంతరం ఉపాధ్యాయుడు మోహన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

మధురవాడలోని ప్రైవేట్ పాఠశాలలో అమానుషం :  8వ తరగతి విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయుడు

పాఠశాల ప్రిన్సిపల్ పిళ్లా శివ సత్యనారాయణ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విద్యార్థి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, దోషి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow