భార్య పేరు మీద భర్త ఆస్తులు కొంటే వాటిపై హక్కులు ఎవరిదంటే? చెన్నా ప్రమోదిని బి.ఏ, ఎల్ ఎల్.బి.

చైర్ పర్సన్, ఫర్ ది పీపుల్ న్యాయ సలహా కేంద్రం. సాధారణంగా ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్, ప్రభుత్వానికి చెల్లించవలసిన టాక్స్ లలో ఏంతో కొంత డబ్బు ఆదా చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఎంతో కొంత డబ్బు ఆదా చేయడం కోసం భార్య పేరుపై భర్త ఆస్తులు కొంటాడు. కానీ ఆతరువాత భర్త మరణానంతరం ఆ భార్యా పిల్లల మధ్య ఆ ఆస్తి కోసం కొన్ని సందర్భాల్లో తగాదాలు, మనస్పర్ధలు వచ్చే సందార్బాలు ఎన్నో సార్లు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో భర్త సొంత డబ్బుతో భార్య పేరు మీద కొనే ఆ ఆస్తులపై హక్కులు ఎవరిది అనే అంశం పరిశీలిద్దాం. మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే, వాటిపై స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 1 నుంచి 2 శాతం తగ్గింపు ఉంటుంది. అందుకే చాలా మంది పన్నులు ఆదా చేసుకోవడానికి, ప్రభుత్వం నుంచి ఇతర ఆర్థిక ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచనతో కొందరు భార్య పేరుపై ప్రాపర్టీలు కొని భార్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఐతే, భార్య తన సొంత డబ్బులతో ఆ ఆస్తిని కొనుగోలు చేయకపోతే.. దాన్ని ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. "

భార్య పేరు మీద భర్త ఆస్తులు కొంటే వాటిపై హక్కులు ఎవరిదంటే?  చెన్నా ప్రమోదిని                  బి.ఏ, ఎల్ ఎల్.బి.

భార్య పేరు మీద ఉన్న ఆస్తి, ఆమె సొంతంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేయకపోతే.. ఆ ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారని కోర్టు స్పష్టం చేసింది."

అంటే ఆ ఆస్తిపై కుటుంబంలోని భార్య, కుమారులు, కుమార్తెలకు సమాన హక్కులు ఉంటాయి.  

హిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 114, హిందూ వారసత్వానికి సంబంధించిన వివాదాలలో సాక్ష్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

 హిందూ వారసత్వ చట్టం, 1956 హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కుల వారసత్వ చట్టాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది. 

 సెక్షన్ 114 ప్రకారం, భార్యకు సొంత ఆదాయం ఉందని నిరూపించలేకపోతే.. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి భర్త ఆదాయం నుండి సంపాదించినట్లు పరిగణిస్తారని కోర్టు పేర్కొంది. భార్య పేరుపై ఉన్న ఆస్తి కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా హక్కుగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో భార్య భర్త సంపాదనతో పొందిన ఆస్తిని భార్య సొంత ఇష్టానుసారం భర్త అనుమతి లేకుండా అమ్మడానికి గాని, వేలం వేయడానికి, ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి హక్కు ఉండదు. భర్త మరణించిన తర్వాత కూడా భార్య వీటిలో ఏదీ చేయడానికి వీలు ఉండదు. భర్త పూర్తిగా ఆ ఆస్తిపై భార్యకు హక్కులు కల్పిస్తే మాత్రమే భార్య ఆ ఆస్తిని ఏదైనా చేసుకోవచ్చు.

 భారతీయ చట్టం ప్రకారం, భర్త జీవించి ఉన్నంత కాలం భార్యకు భర్త ఆస్తిపై ప్రత్యక్ష యాజమాన్య హక్కులు ఉండవు. 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం, భర్త మరణించిన తర్వాత, భార్యకు ఆ ఆస్తిపై.. ఎలాంటి హక్కు ఉంటుందో.. అలాంటి హక్కే కుమారులు, కుమార్తెలకు కూడా సమానంగా లభిస్తుంది. భర్త వీలునామా రాసి వుంటే మాత్రం ఆ వీలునామాకు లోబడి నడుచుకోవాలి.

 మీరు మీ భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తుంటే.. ఆమె సంపాదించకపోతే, భవిష్యత్తులో మీ పిల్లలు, ఇతర వారసులు కూడా ఆస్తిలో వాటా పొందేందుకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆమె స్వయంగా సంపాదించకపోతే, ఆ ఆస్తి కుటుంబ ఆస్తిగా పరిగణించవచ్చు. ఒకవేళ వీలునామాలు ఒక్కో పేరున ఒక్కో విధంగా ఆస్తికి పూర్తి యజమాని అయిన వ్యక్తి రాసి ఉంటే.... ఈ వీలునామాల్లో ఆ యజమాని మరణించే ముందు ఏదైతే చివరి వీలునామా రాస్తాడో తేదీ ప్రకారం చిట్ట చివరి వీలునామా మాత్రమే పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow