ధర్మ పరిరక్షణకు ప్రతి రూపం పరమశివుడు సేవాభావంతోనే సంపూర్ణ విజయాలు శివజయంతి ఉత్సవాల్లో నగర పోలీస్ కమిషనర్ బాగ్చీ
డాబాగార్డెన్స్, ఫిబ్రవరి25: ధర్మ పరిరక్షణకు ప్రతి రూపం ఆ పరమ శివుడేనని, రుద్రభూమిలో ప్రతక్ష్యమైనప్పటికీ నిస్వార్ధంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మహాశివరాత్రి పర్వదిన వేడుకులు, శివజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన బాగ్చీ మాట్లాడుతూ నిస్వార్ధ సేవలకు ప్రతిరూపం శివుడేనన్నారు. ఆయన నిరంతరం విభూది ధరించి, సామాన్యుడిగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు. పరమ శివుడిని సేవా భావంతో స్మరించుకుంటే సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి విజయాలు లభిస్తాయన్నారు.విభజన సమయంలో తనను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏక్కడ విధులు నిర్వహిస్తారని ఆప్షన్ అడిగారని, అయితే తాను ఏపీనే ఎంచుకోవడం జరిగిందన్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందన్నారు.తాను పరమశివుడు భక్తుడనని, ఏపీలో ఎక్కడ చూసినా అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఉన్నాయని అందువల్లే ఏపీలో విధులు నిర్వహించడానికి ఇష్టపడటం జరిగిందన్నారు. తన సతీమణి కూడా శి
అప్పికొండ సోమేశ్వర ఆలయంతో పాటు అనేక శివాలయాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఈ సందర్భంగా అందరికీ శివరాత్రి శుబాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిధిగా హాజరైన కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ పి.శివానంద మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి కష్టపడే తత్వంతో ముందుకు సాగానన్నారు. అలాగే భీమిలి ప్రాంతంలో చదువుకున్న సమయంలోనే ఆధ్మాత్మిక భక్తిభావం అలవర్చుకున్నట్లు చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ మాదిరిగానే తాను కూడా నిరంతరం సహయం అందించడానికి సిద్దంగా ఉంటానన్నారు. తన వద్దకు వచ్చే రోగులకు నిరంతరం సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇటీవలే బ్రహ్మకుమారీలతో కలసి ప్రత్యేక కార్యక్రమం కూడా తాను నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వాహకురాలు బి.కె. రామేశ్వరి మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం లోకానికి అత్యంత పుణ్యప్రదంగా నిలుస్తుందన్నారు. శివుడిని పూజించే భక్తులందరికీ పాపాల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా మంచి జీవితాన్ని ప్రసాదించే మహిమ గల స్వామిగా అభివర్ణించారు. జాతి,మత, కుల వైష్యమాలను తొలగించుకుని సర్వమానవ సౌబ్రాతత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. శివ జయంతి వేడుకులకు అధ్యక్ష్యత వహించిన సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పరమశివుడిని ఆరాధించడం వల్ల సర్వజీవులకు సంతోషం కలుగుతుందన్నారు. అందుకే శివరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరమశివుడిని పూజించి ఉన్నంతలోనే సుఖ, సంతోషాలతో గడపాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు. బ్రహ్మకుమారీస్ వివిధ సంస్థలకు చెందిన సత్యవతి, శివలీల, శశికళ తదితరులంతా మాట్లాడుతూ శివరాత్రి గొప్పతనాన్ని తెలియజేశారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు, స్కూల్ ఆఫ్ ధియేటర్ ఆర్ట్స్ సీనియర్ కోరియోగ్రాఫర్ ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నృత్య కళాకారిణీ ఆరేకె టీనాను అతిధులు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్, జర్నలిస్టులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
What's Your Reaction?