చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేష్టలకు ప్రజలే బుద్ధి చెబుతారు -దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా "వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

వెన్నుపోటు చంద్రబాబు, రాజకీయ వికలాంగుడు పవన్ కళ్యాణ్ పిచ్చి చేష్టలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గంలో గల 29వ వార్డు జగదాంబ జంక్షన్ వైయస్సార్ విగ్రహం వద్ద వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే, దక్షణ నియోజకవర్గ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్,

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేష్టలకు ప్రజలే బుద్ధి చెబుతారు  -దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా "వైసీపీ ఆవిర్భావ దినోత్సవం  వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, జాన్ వెస్లీ, కొండా రాజీవ్ గాంధీ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం మహిళలకు పేద చీరల పంపిణీ చేశారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 14 ఏళ్ల లో వైయస్సార్సీపి ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు రామరాజ్యాన్ని అందించిన చరిత్ర వైసీపీ ది మాత్రమేనన్నారు. వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే సంక్షేమ నందించారన్నారు. జత కట్టకపోతే ఎమ్మెల్యే కూడా అవ్వలేని పవన్ కళ్యాణ్, కుటిల రాజకీయాల చేసే చంద్రబాబు నేడు పచ్చి అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డిని, ప్రశ్నించే వైసిపి శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు చేయడం దుర్మార్గమన్నారు. నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిలా ఇచ్చిన హామీలను, యువతకు రైతుకు మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేసి మాట్లాడాలని హితవు పలికారు. నేడు "యువత పోరు" కార్యక్రమం అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో విజయవంతంగా జరిగిందన్నారు. రూ.3000 నిరుద్యోగ భృతి, యువతకి ఉద్యోగ అవకాశాలుతో పాటు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువత ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సౌత్ వార్డు ప్రెసిడెంట్స్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సౌత్ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow