కిడ్నీ బాధితులకు వాసుపల్లి 10,000 ఆర్థిక సాయం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
దక్షిణ నియోజకవర్గంలో కిడ్నీ సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరి పేషెంట్లకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5000 చొప్పున 10,000 లు మెడికల్ ఖర్చులకు అందజేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో శనివారం సొంత నిధులు రోగులకు స్వయంగా అందజేసి అండగా నిలిచారు. 27వ వార్డు దొండపర్తి ప్రాంతనికి చెందిన దల్లి శ్రీనివాస్ (48) లివర్ మరియు కిడ్నీ సమస్యతో కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నాడని, అలాగే ఆశీల్ మెట్ట ప్రాంతానికి చెందిన ఎల్లపిల్లి జ్యోతి(62) కిడ్నీ సమస్యతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ వారిద్దరికీ సహాయం అందజేసి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు నిత్యవసర సరుకులు కొనలేని స్థితికి తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అందించలేక ఏడు నెలలుగా ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ప్రజలు నాడిని తెలుసుకున్న వైయస్సార్ ఆరోగ్యశ్రీ రెట్టింపు చేసి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉచిత వైద్యంతోపాటు ఇంటి వద్ద మందు ఖర్చు
కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న హయాంలో వార్డు సచివాలయాల ద్వారా రూపాయి అవినీతి లేకుండా ప్రభుత్వ పనులు నిర్వహించే వారిని, కానీ నేడు ప్రతి ప్రభుత్వ సర్టిఫికెట్లకు లంచాలు లేకుండా పని జరగడం లేదని ఆరోపించారు. పాల్గొన్నారు
What's Your Reaction?