ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహణకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల తెలుగు శక్తి హర్షం
వైసిపి కోవర్ట్ అయితే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పండుగ నిర్వహించాలని పోరాటం చేస్తానా? ఎన్టీఆర్ కు తెలుగు శక్తి ఘన నివాళి చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి ---- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆకాంక్ష విశాఖపట్నం: తెలుగు శక్తి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 102వ జయంతి నిర్వహించారు. బుధవారం ఉదయం.. రామకృష్ణ బీచ్ లోని ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతిని ప్రతి ఏటా పండుగలా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజున సంక్రాంతి, దసరా దీపావళి ఒకేసారి వచ్చినట్టుగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా నందమూరి తారకరామారావు జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించాలని తెలుగు శక్తి ఎంతో ప్రయత్నం చేసిందన్నారు.
తనను కొంతమంది వైసిపి కోవర్టు అని ఆరోపించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తన నిబద్ధత ఏమిటో చాటుకుంటున్నానని తెలియజేస్తూ.. తన తెలుగు దేశం పార్టీ సభ్యత్వం కార్డును మీడియా ముందు ప్రదర్శించారు. తను నిజంగా వైసిపి కోవర్ట్ అయితే అన్న నందమూరి తారకరామారావు జయంతిని ప్రభుత్వ పండుగ నిర్వహించాలని పోరాటం చేస్తానా? అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో కోడే బాబురావు డాక్టర్ పెంటకోట త్రినాధ రావు, రావి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?