కంచర్ల అచ్యుతారావు గారి సహాయ సహకరాలతో ఘనంగా ప్రారంభమైన వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ

.సమాజ సేవలో నిరంతరం బిజీగా గడుపుతూనే మరోవైపు జర్నలిస్టుల క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని జీవీఎంసీ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇ. ఎ.అప్పలరాజు అన్నారు. విశాఖ మీడియా క్రికెట్ టోర్నీ సోమవారం జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కంచర్ల అచ్యుతారావు తాము ఎల్లవేళల జర్లలిస్టులు అండగా నిలబడతాను అనడం దానికి నిదర్శనంగా నేడు ఘనంగా ప్రారంభించడానికి పూర్తి సహాయ సహకారాలను అందించి తమకు జర్లలిస్టులపై ఉన్న అభిమానానికి నిదర్శనగా తమ దతృత్వాని చాటుకున్నారు.

కంచర్ల అచ్యుతారావు గారి సహాయ సహకరాలతో ఘనంగా ప్రారంభమైన వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ

ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి యేటా జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దేహదారు డ్యము లభిస్తుంది అన్నారు. జీవీఎంసీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ ఈ నెల 22 వరకు కొనసాగుతుందని ప్రతి. ఒకరు క్రీడా స్ఫూర్తిని. అవలంబించాలన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అందరు సరదాగా టోర్నీలో పాల్గొనాలని కోరారు. జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు శ్రీను బాబు చెప్పారు. ఈ టోర్నీ నిర్వాహకులు గాజుల గురు ప్రసాద్. కె.మదన్ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా టాస్ గెలిచిన వీడియో జర్నలిస్టులు 12ఓవర్లకు 148/3 చేయగా ఫొటో జర్నలిస్టులు 12 ఓవర్లకు 78/4 చేశారు. విజేతలుగా వీడియోజర్నలిస్టులు సెమి ఫైనల్స్ కు చేరుకున్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow